రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : ఈరోస్ ఇంటర్ నేషనల్.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ.
తారాగణ౦ : నానా పటేకర్, సంజీవ్ జైశ్వాల్, అతుల్ కులకర్ణి తదితరులు.
26/11 ఇండియాపై దాడి అనేది, 26.11.2008 నాడు, నిజంగా ముంబయి మీద ఉగ్రవాదులు చేసిన దాడి. ఆ దాడిని జరిగింది జరిగినట్లుగా చూపించే ప్రయత్నమే ఈ సినిమా.
ఆ రోజు ర్రాత్రి 09:30 గంటలనుంచి ఒంటిగంట వరకు జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయి లోపలికి ఎలా వచ్చారు?, వచ్చిన తరువాత ఎక్కడెక్కడ కాల్పులు జరిపారు?, ఆ తరువాత వారు పోలీసులకి దొరికిపోయారా?, చచ్చిపోయారా? లేక పారిపోయారా? అనేది కథ.
అనుకూలాంశాలు :
ఈ సినిమా చూస్తున్న౦తసేపు, నిజంగా మనం అక్కడ ఉండి ఆ కాల్పులను దగ్గరగా చూస్తున్నట్లే అనిపిస్తుంది కానీ, సినిమా చూస్తున్న భావం కలగదు. అంత బాగా తెరకెక్కించారు రా౦గోపాల్ వర్మ.
హోటల్ తాజ్ లో తీవ్రవాదులు జరిపిన కాల్పుల సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. అవి చాలా హృదయ విదారకంగా ఉంటాయి.
తనను కాలుస్తున్నప్పటికీ, ఒక పోలీసాఫీసర్ తన ప్రాణాలకి తెగించి కసబ్ ని క్యాప్చర్ చేసే సన్నీవేశ౦ చాలా బాగా పండింది.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మానసికంగా కదిలిపోవాల్సిందే.
ప్రతికూలాంశాలు :
కసబ్ అనే ముఖ్య పాత్ర చేసిన పాత్రధారి చక్కగా నటించాడుగానీ, చూడగానే ఆకట్టుకునేలా లేడు.
రాష్ట్రానికే పోలీస్ పెద్దైన పోలీస్ కమీషనర్, ఫోన్లు మాట్లాడుతూ, టీవీ వార్తలు చూస్తూ ఆఫీసులో కంప్యూటర్ల దగ్గర హడావిడీ చేస్తాడు కానీ, అంతటి ఉత్కంఠ పరిస్థితుల్లో కూడా కాల్పులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించి, అంతా అదుపులోకి తీసుకోవడానికి గానీ, కాల్పులు జరగకుండా ఆపడానికి గానీ ఎటువంటి ప్రయత్నం చేయడు.
ఆయా ప్రదేశాలకు సంబంధించిన కాల్పుల సన్నివేశాల దృశ్యాలు, తగిన ధ్వనులతో చూపించకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో చూపించటం వలన ఆ సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి అంతగా ఎమోషన్ కు గురి చేయలేక పోయాయి.
ఉగ్రవాదులనేవాళ్ళు పక్కా ప్లాన్ తో సిటీలోకి ప్రవేశించి, వివిధ ప్రదేశాల్లో చక చకా నిమిషాల్లోనే కాల్పులు జరిపి వెనువెంటనే పారిపోవటానికి ప్రయత్నిస్తారు లేక పారిపోవటానికి అవకాశం లేకపోతె లోపలే ఉండి లోపల ఉన్నవాళ్ళను మరియు బయట ఉన్న పోలీసులను ఉత్కంఠకు గురిచేస్తూ చివరకు చస్తారు లేక చంపుతారు. ఇలా దూకుడుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కానీ, ఈ సినిమాలో అలా కాకుండా ఆ ఉగ్రవాదులు కాల్పులు జరపాల్సిన ప్రదేశంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచీ నెమ్మదిగా నడుస్తూ నింపాదిగా, కూల్ గా కనీసం భయం లేకుండా మనుషుల్ని కాలుస్తు౦టారు. నెమ్మదిగా అందరినీ వెతికి వెతికి కాలుస్తూ ఉంటారు. చివరికి అందరిని కాల్చిన తరువాత నెమ్మదిగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు నెమ్మదిగా వచ్చి, నెమ్మదిగా కాల్చి, నెమ్మదిగా వెళ్లిపోయేవరకు అస్సలు పోలీసులకు సమాచారం అందదా?, వాళ్ళు వచ్చి దాడులు చెయ్యరా?
మాటల ద్వారా వివరిస్తూ, డ్రామా కలిగిన దృశ్యాలను కలిగిఉంటే దాన్ని డాక్యూ డ్రామా అంటారు. ఈ సినిమా అలానే ఉంది. ఎందుకంటే, జరిగిన సంఘటలను, పోలీస్ కమీషనర్, ఎంక్వైరీ కమీషన్ ముందు మాటలతో వివరిస్తు౦టాడు. మధ్య, మధ్యలో ముక్కలు ముక్కలుగా డ్రామా కలిగిన సన్నివేశాలు వస్తూ, పోతూ ఉ౦టాయి. అందువలన, కథనం, ప్రేక్షకుణ్ణి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిజంగా జరిగిన స౦ఘటనలను, ఎటువంటి మార్పు లేకుండా తీసుకొని, వాటికి మంచి కథా రూపం ఇచ్చి, ఆకట్టుకునేలా కథనం వ్రాసుకొని, మంచి ముగింపు ఇచ్చినట్లయితే, నిజంగా, సినిమా, ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో గుచ్చుకుపోయేదేమో!. కథనం మరియు ముగింపు, సినిమా చూసిన అందరినీ, ముఖ్యంగా ఉగ్రవాదులను ఆలోచింపచేసేలా ఉంటే బాగుండేదేమో!.
పోలీస్ కమీషనర్, కసబ్ ని విచారణ చేస్తున్నపుడు, కసబ్, తమ గురువు తాము ఇక్కడికి వచ్చేముందు ఎలాంటి శిక్షణ ఇచ్చాడు, ఎం మాటలు చెప్పి మానసికంగా ప్రిపేర్ చేసాడు అనే విషయాలను మాటల రూపంలో చెప్తాడు. కానీ, అలా కాకుండా, కథ మొదట్లోనే, వాళ్ళ గురువు వాళ్ళకి శిక్షణ ఇవ్వటాన్ని దృశ్యరూపంలో చూపి౦చినట్లైతే, మంచి ఫీల్ కలిగేదేమో!.
దర్శకత్వం :
ఆయన ఎత్తుకి తగ్గట్టు కాకపోయినా, ఈ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మగారి దర్శకత్వం బాగానే ఉంది. ఈ సినిమా చెయ్యడం ద్వారా, రాంగోపాల్ వర్మ మంచి ప్రయత్నమే చేసాడని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ సినిమా చూడటం ద్వారా, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తారు. తీవ్రవాదులు, అయ్యో! మనం అనవసరంగా తప్పు చేశామేమో అని భావించవచ్చు. ప్రభుత్వం, ఈ ఆకృత్యాలను నివారించడం ఎలా? లేక ఈసారి జరుగుతు౦దనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాని మీద ఆలోచించవచ్చు. వీటిని అరికట్టడానికి, ప్రజలు, ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించాలి లేక ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నవిషయం గురించి ఆలోచించవచ్చు. ఆ కాల్పుల భాదితులు, ఈసారి మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అన్నవిషయం మీద ఆలోచించవచ్చు. ఈ సినిమా తీయడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.
చివరగా : ఈ సినిమా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది.
You must be logged in to post a comment.