The Attacks Of 26/11 – Official Theatrical Trailer (Exclusive)
18 Friday Jan 2013
Posted Hindi Movie Trailers
in18 Friday Jan 2013
Posted Hindi Movie Trailers
in18 Friday Jan 2013
Posted by Prasanna Kumar | Filed under Hindi Movie Posters
14 Monday Jan 2013
Posted తెలుగు
inప్రస్తుతం ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. ప్రతి మనిషీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బే సర్వస్వం అనుకుంటున్నాడు. డబ్బు లేనిదే ఈ జీవితం లేదు అనుకుంటున్నాడు. డబ్బే అన్ని సుఖ శాంతులనిస్తుంది అనుకుంటున్నాడు. డబ్బే అన్ని సమస్యలను తీరుస్తుందనుకుంటున్నాడు. డబ్బుంటే చాలు ఇంకేది అవసరం లేదు అనుకుంటున్నాడు. ఇంకెవరూ అవసరంలేదు అనుకుంటున్నాడు. డబ్బుకోసం చస్తున్నాడు, డబ్బుకోసం చంపుతున్నాడు. డబ్బుకోసం ఎవరినైనా వదులుకుంటున్నాడు. భార్య భర్తను పట్టిచ్చుకోవట్లేదు, భర్త భార్యను పట్టిచ్చుకోవట్లేదు, ఇద్దరూ కలిసి పిల్లలను పట్టిచ్చుకోవట్లేదు.
డబ్బు అంత ముఖ్యమైనదా? డబ్బు ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఇంకేమీ అవసరంలేదా? ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషీ ప్రధాన లక్ష్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే. డబ్బే సంతోషాన్నిస్తుందనుకుంటున్నాడు ప్రస్తుతం మానవుడు. ఇలా డబ్బే పధానంగా ముందుకు సాగితే, డబ్బే సంతోషాన్నిస్తుందనుకుంటే చివరకు మనకంటూ ఎవరూ ఉండరు. డబ్బు ఒకరికి శాశ్వతం కాదు. అది చేతులు మారుతూ ఉంటుంది. డబ్బు అప్పటికప్పుడు సంతోషాన్నిస్తుందేమోగానీ శాశ్వత సంతోషాన్నివ్వదు. డబ్బు ప్రతీ సమస్యను పరిష్కరించదు.
మనిషి ఏ సమస్యనైనా తీర్చగలిగేది బంధం మాత్రమే. మనిషి సంతోషానికి కారణం బంధం. మన సంతోషాల్ని, బాధల్నీ ఎల్లప్పుడూ పంచుకుంటూ, మన సమస్యలని తీర్చేవారంటూ మనకొకరుంటే మన జీవితం ఎల్లప్పుడూ సంతోషకరమే. డబ్బు కన్నా బంధమే ప్రధానం. అవసరమైతే బంధంకోసం డబ్బుని వదులుకోవాలి గానీ డబ్బుకొసం బంధాన్ని వదులుకోకూడదు. డబ్బు కన్నా బంధమే ప్రధానం. మనిషికి ఈ డబ్బు పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో!!!!
14 Monday Jan 2013
Posted తెలుగు
inTags
ఏదైనా ఒక స్కూళ్ళోగానీ, కాలేజీలోగానీ ఒకే ఒక్క అందమైన అమ్మాయి ఉంటే చాలు, మగ పోరగాళ్ళ చేతిలో ఆ అమ్మాయి జీవితం నాశనం అయినట్లే. ఒకడు నిన్ను ప్రేమిస్తున్నానంటాడు. ఒకడు నీతో స్నేహం చేయాలనుంది అంటాడు. ఒకడు ఎప్పుడూ ఎవో కామెంట్లు చేస్తూ ఏడ్పిస్తుంటాడు. ఒకడు ఇంకేదో కావాలంటాడు.
ఇలాంటి గోల నేపధ్యంలో, ఆ అమ్మాయి ఎవడికో ఒకడికి పడిపోతుంది ప్రేమ పేరుతో. ఆ అమ్మాయి అలా ఒక పోరగాడికి పడిపోవడానికి కారణం, వాడు గల గలా మాట్లాతుండటం కావచ్చు, ఎప్పుడూ నవ్విస్తుండటం కావచ్చు. అందంగా ఉండటం కావచ్చు, వాడు క్లవర్ స్టుడెంట్ కావచ్చు. ఇలాంటి తొక్కలో కారణాలేవైనప్పటికీ, ఆ అమ్మాయి ఒకళ్ళిద్దరికి పడిపోయి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది, ఈ అమ్మాయి ఎలాగూ అందంగా ఉంది కాబట్టి మిగతా మగ పోరగాళ్ళందరూ ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటారు. ఈ వ్యవహారమంతా ఆ అమ్మాయి ఇంట్లో తెలిసి మా అమ్మాయి జీవితం నాశనం అయ్యేటట్లుందని భయపడి, ఆ అమ్మాయి చదువు మధ్యలోనే మానిపించేసి వెంటనే తొందరపడి ఎవడు దొరికితే వాడికి ఒక చెత్తగాడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి చేసి ఆ అమ్మాయి జీవితం తమ చేతులారా తామే నాశనం చేసేస్తారు.
ఈ తతంగమంతా జరుగుతున్నసమయంలో, ఆ అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి చేత ప్రేమించబడిన మగ పోరగాడు ఎటు పోయాడు. వాడు నిజంగా ప్రేమించినవాడైతే, ఆ అమ్మాయి చదువు మధ్యలోనే ఎందుకు ఆపించేసారు అని వాళ్ళ తల్లిదండ్రులను నిలదీయొచ్చుగా? ఎవడికో చెత్తగాడికిచ్చి పెళ్ళి చేస్తుంటే ఆ పెళ్ళి ఆపొచ్చుగా?. ఏమండీ, నేను మీ అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను, సెటిల్ అయిన తరువాత నేనే మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను. దయచేసి మీరు ఆ అమ్మాయి చదువు మధ్యలోనే మానిపించెయ్యొద్దు, చిన్న వయస్సులోనే పెళ్ళి చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చెయ్యొద్దు అని వాళ్ళ తల్లిదండ్రులను వేడుకోవచ్చుగా?. ఈ మగ పోరగాళ్ళది నిజమైన ప్రేమ కాదు ఏమీ కాదు, ఒట్టి ఆకర్షణ. ఆ అమ్మాయి అందంతో వచ్చిన ఆకర్షణ. ఇలా ఎన్నాళ్ళు? ఇలా ఒక అందమైన అమ్మాయి ఎంతోమంది మగ పోరగాళ్ళ మధ్య నలిగిపోవల్సిందేనా? ఆ అమ్మాయి జీవితం నాశనం కావల్సిందేనా? ఇలా ఇంకెన్నాళ్ళు?.
14 Monday Jan 2013
Posted Dalai Lama Quotes
inWe forget that despite the superficial differences between us, people are equal in their basic wish for peace and happiness. – Dalai Lama
14 Monday Jan 2013
Posted Dalai Lama Quotes, Moral Quotes
inWe live in a world in which we are dependent on others; we cannot expect to fulfill our goals while disregarding others’ needs. – Dalai Lama
14 Monday Jan 2013
Posted Moral Quotes
inIt’s just better to be yourself than to be some version of what you think the other person wants. – Matt Damon
10 Thursday Jan 2013
Posted తెలుగు
in
నిజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే, ప్రేమిస్తే అసలు సమస్యే లేదు. ఎందుకంటే ఆ నిజంగా ప్రేమించిన అమ్మాయి ఆ అబ్బాయి సంతోషాన్ని కోరుకుంటుంది. ఆ అబ్బాయి భావాలను అర్థం చేసుకుంటుంది. ఆ అబ్బాయితో మనస్పూర్తిగా మట్లాడుతుంది. ఆ అబ్బాయి సంతోషాలని, భాధలని పంచుకుంటుంది.
కానీ ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాలా తక్కువ. ముందే ఒక అబ్బాయికి, ఒక అమ్మాయి నచ్చి ఆ అమ్మాయిని ప్రేమించటం మొదలుపెట్టిన తరువాత ఎలాగైనా ఆ అమ్మాయిని తన ప్రేమకు ఒప్పిస్తే, ఆ తరువాత ఆ అబ్బాయి పని అయిపోయినట్లే.
అమ్మాయిలు ఒకసారి ఇష్టపడుతున్నారనిపిస్తుంది, ఒకసారి ఇష్టపడట్లేదనిపిస్తుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరన్న్నట్లుగా, వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, వాళ్ళ మాటల వెనుక అర్థం ఏమిటొ అర్థం కాదు. సాధారణంగా అమ్మాయిలు వాళ్ళ మూడుని బట్టి, పరిస్థితినిబట్టి, అవసరాన్నిబట్టి మాట్లాడతారు. అందుకే వాళ్ళ మాటల్లో స్థిరత్వం ఉండదు. భావం ఉండదు. ప్రేమ ఉండదు. అందుకే వాళ్ళ ఫైనల్ ఫీలింగేమిటో మగాళ్ళకు అర్థం కాదు. అబ్బాయిలేమో ఆ మాటలను సీరియస్ గా తీసుకొని ఆ మాటల వెనుక అర్థమేమిటో తెలుసుకోవటానికి ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కి పోతారు. అలా అలోచనలెక్కువై నిద్రపట్టక ఆరోగ్యం చెడగొట్టుకుంటాడు మగాడు.
ఇలా ప్రేమ పేరుతో మగాళ్ళని ఆడాళ్ళు వాడుకొని వాడుకొని చివరకు ఏవో పరిస్థితుల కారణంగా, కనీసం కారణం కూడా చెప్పకుండా అకస్మాత్తుగా ఆ అబ్బాయిని వదిలేసి వేరే వాణ్ణి పెళ్ళి చేసుకుంటారు. ఈ రోజుల్లో నిజంగా నిజమైన ప్రేమకంటే ఇలాంటి కేసులే ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ చివరికి జీవితం నాశనం చేసుకునేది మగాడే.
09 Wednesday Jan 2013
Posted by Prasanna Kumar | Filed under Telugu Movie Posters
09 Wednesday Jan 2013
Posted General Quotes
inThe flower that blooms in adversity is the most beautiful of all
You must be logged in to post a comment.