Advertisements

Hi

Hi

Advertisements

బ్యాడ్ బోయ్ తెలుగు సినిమా ట్రైలర్ – అనుష్క, కార్తి

Tags

, , ,

“బ్యాక్ బెంచ్ స్టూడెంట్” తెలుగు సినిమా రివ్యూ

Tags

,

"Back Bench Student" Telugu Movie Review

రేటింగ్: 2/5

చిత్రం: బ్యాక్ బెంచ్ స్టూడెంట్

నిర్మాణ స౦స్థ: షిరిడీ సాయి కంబైన్స్

సంగీతం: సునీల్ కాశ్యప్

నిర్మాత: ఎమ్.వి.కె.రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మధుర శ్రీధర్

తారాగణం: మహత్ రాఘవేంద్ర, పియా బాజ్ పాయ్, అర్చన కవి తదితరులు.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటే చదువు సరిగా రానోడు. చదువు అంటే పెద్దగా నచ్చనోడు. సీరియస్ గా చదివి, డిగ్రీలు, సర్టిఫికెట్లు సంపాదించి, తరువాత ఉద్యోగం చెయ్యాలి అనే కాన్సెప్ట్ నచ్చనివాడు. అటువంటివాడు జీవితంలో రాణి౦చాడా? రాణిస్తే ఎలా రాణించాడు? అటువంటివాడిని ఒక చదువు మీద ఆసక్తి చూపించే అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనేది సబ్జెక్ట్.

కథోపాయం:

జీవితంలో సంతోషంగా ఉండాలన్నా, పైకి రాణి౦చాలన్నా, డిగ్రీలు, సర్టిఫికెట్లు అవసరంలేదు, టాలెంట్ ఉంటే చాలు. పిల్లల చదువు, కెరీర్ విషయంలో తల్లిదండ్రుల ఇష్టాలు వాళ్ళమీద రుద్ది వాళ్ళను ఒత్తిడికి గురి చేయకూడదు. ఇంకా, సామాజిక బాధ్యత వహిస్తే ఆపైన వచ్చే సంతృప్తే వేరు. వీటన్నింటి చూట్టూ కథ తిరుగుతుంటుంది.

అనుకూలం:

పాయింట్ చిన్నదైనా, కథ బాగుండటం, కథానాయకుడి పాత్ర పోషించిన మహాత్ రాఘవేంద్ర నటన బాగుండటం..

ప్రతికూలం:

కథనం (కథ చెప్పే విధానం) చాలా నెమ్మదిగా ఉండి, అస్సలు ఆకట్టుకునేలా లేదు. పైగా కథ చిన్న పాయింట్ అవ్వడంవలన కూడా, కథనం సాగతీసినట్లయి బోరు కొడుతుంది. పాటల నడక కూడా నేమ్మదే.

చదువే ముఖ్యం అనుకొని వెళ్ళిపోయినంతమాత్రాన, నాలుగు సంవత్సరాలనుంచి ప్రేమించిన అమ్మాయిని ఈజీగా పక్కకి పెట్టేసి, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడటం ఏమిటో? తరువాత, అతనిని గాఢ౦గా  ప్రేమించిన ఆ రెండో అమ్మాయి కూడా, వీడికి ఇంతకుముందే గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియగానే, నన్ను మోసం చేసావని అతనికి దూరమయ్యే ప్రయత్నం చెయ్యడమెందుకో?. చివరికి, తన గాఢమైన ప్రేమను సింపుల్ గా ప్రక్కన పెట్టేసి, మొదటి అమ్మాయి తన ప్రేమను త్యాగం చేయడమేమిటో?. చివర్లో, తనను గాఢ౦గా ప్రేమించిన, ప్రేమిస్తునేఉన్న అమ్మాయిని అస్సలు పట్టిచుకోకుండా వేరే అమ్మాయితో కమిట్ అవ్వడం ఏమిటో?

చివరగా: పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు.

Image

“రయ్ రయ్” తెలుగు సినిమా నేడే విడుదల

Tags

,

Ray Ray Telugu Movie showing in theaters from today

“ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2” తెలుగు సినిమా ట్రైలర్

Tags

, , , ,

“బ్యాక్ బెంచ్ స్టూడెంట్” తెలుగు సినిమా ట్రైలర్

Tags

,