Tags

 

అమ్మాయిలతో పెట్టుకుంటే అంతే!

 

నిజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే, ప్రేమిస్తే అసలు సమస్యే లేదు. ఎందుకంటే ఆ నిజంగా ప్రేమించిన అమ్మాయి ఆ అబ్బాయి సంతోషాన్ని కోరుకుంటుంది. ఆ అబ్బాయి భావాలను అర్థం చేసుకుంటుంది. ఆ అబ్బాయితో మనస్పూర్తిగా మట్లాడుతుంది. ఆ అబ్బాయి సంతోషాలని, భాధలని పంచుకుంటుంది.

కానీ ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాలా తక్కువ. ముందే ఒక అబ్బాయికి, ఒక అమ్మాయి నచ్చి ఆ అమ్మాయిని ప్రేమించటం మొదలుపెట్టిన తరువాత ఎలాగైనా ఆ అమ్మాయిని తన ప్రేమకు ఒప్పిస్తే, ఆ తరువాత ఆ అబ్బాయి పని అయిపోయినట్లే.

అమ్మాయిలు ఒకసారి ఇష్టపడుతున్నారనిపిస్తుంది, ఒకసారి ఇష్టపడట్లేదనిపిస్తుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరన్న్నట్లుగా, వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, వాళ్ళ మాటల వెనుక అర్థం ఏమిటొ అర్థం కాదు. సాధారణంగా అమ్మాయిలు వాళ్ళ మూడుని బట్టి, పరిస్థితినిబట్టి, అవసరాన్నిబట్టి మాట్లాడతారు. అందుకే వాళ్ళ మాటల్లో స్థిరత్వం ఉండదు. భావం ఉండదు. ప్రేమ ఉండదు. అందుకే వాళ్ళ ఫైనల్ ఫీలింగేమిటో మగాళ్ళకు అర్థం కాదు. అబ్బాయిలేమో ఆ మాటలను సీరియస్ గా తీసుకొని ఆ మాటల వెనుక అర్థమేమిటో తెలుసుకోవటానికి ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కి పోతారు. అలా అలోచనలెక్కువై నిద్రపట్టక ఆరోగ్యం చెడగొట్టుకుంటాడు మగాడు.

         ఇలా ప్రేమ పేరుతో మగాళ్ళని ఆడాళ్ళు వాడుకొని వాడుకొని చివరకు ఏవో పరిస్థితుల కారణంగా, కనీసం కారణం కూడా చెప్పకుండా అకస్మాత్తుగా ఆ అబ్బాయిని వదిలేసి వేరే వాణ్ణి పెళ్ళి చేసుకుంటారు. ఈ రోజుల్లో నిజంగా నిజమైన ప్రేమకంటే ఇలాంటి కేసులే ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ చివరికి జీవితం నాశనం చేసుకునేది మగాడే.

Advertisements